Home  »  TV News  »  Podharillu:గాయత్రి మాటతో స్టేషన్ నుండి బయటకి వచ్చిన ఆ నలుగురు.. మహాలక్ష్మి ముందడుగు!

Updated : Mar 13, 2026

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ పొదరిల్లు (podharillu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-69 లో.. కేశవ, చక్రి, మాధవ, కన్నా అందరు పోలీస్ స్టేషను లో ఉంటారు. వారిని విడిపించడానికి మహాలక్ష్మి ప్రయత్నిస్తుంది. ఇక జరిగిందంతా ఎస్ఐ కి చెప్తుంది మహా.‌ కానీ అతను‌ నమ్మడు. దాంతో గాయత్రీకి కాల్ చేస్తుంది‌ మహా. బావ తీసుకెళ్ళినప్పటి నుండి ఏడుస్తూనే ఉన్నానని గాయత్రీ అనగానే నువ్వు ఏడిస్తే పెద్ది బయటకు రాడు..నువ్వు స్టేషన్ కి వచ్చి నిజం చెప్తే బయటకు వస్తాడని మహా కాల్ లో అడుగుతుంది. అయితే ఎస్ఐ నమ్మాలంటే నువ్వు వీడియో కాల్ లో మాట్లాడమని చెప్తుంది. సరేనని గాయత్రీ అంటుంది. ఇక మహా వీడియో కాల్ చేసినప్పుడే గాయత్రీ వాళ్ళ అమ్మ తాయారు వచ్చి ఫోన్ లాక్కొని వెళ్ళిపోతుంది. దాంతో ఎందుకు వీడియో కాల్ లిఫ్ట్ చేయడం లేదని ఎస్ఐ అడుగుతాడు.

వాళ్ళ అమ్మ భయపెట్టి ఫోన్ లాగేసుకున్నట్టుందని మహా అంటుంది. ఇక పోలీసులని వెంటబెట్టుకొని గాయత్రీ వాళ్ళ ఇంటికి వెళ్తుంది మహా. ఇక తాయారు, వాళ్ళ ఆయన పురుషోత్తం , వాళ్ళ అన్నయ్య ఉంటారు. ఎస్ఐ వచ్చి గాయత్రీని బయటకి పిలవండి మాట్లాడాలి అని అంటాడు. తను రాదని తాయారు అంటుంది. తనతో మాట్లాడనివ్వకపోతే మిమ్మల్ని స్టేషన్ కి తీసుకెళ్ళాల్సి వస్తుందని ఎస్ఐ అనగానే గాయత్రీని తీసుకురావడానికి తాయారు  వెళ్తుంది. గాయత్రీ దగ్గరికి వచ్చిన తాయారు.. బయట పోలీసులు ఉన్నారు. వాళ్ళకి నిజం చెప్పావో.. నేను, మీ నాన్న చచ్చిపోతామని బెదిరిస్తుంది. దాంతో బయటకి వచ్చిన గాయత్రీ ఎస్ఐ ఏం అడిగినా మౌనంగా ఉంటుంది. 

నువ్వే పెద్ది దగ్గరికి వచ్చావని, నిన్ను ఎవరు బలవంతం చేయలేదని చెప్పు , చక్రి కేశవ గొడవకి వెళ్తే అందులో పెద్ది, కన్నాలని చేర్చారు. నువ్వు చెప్పే సమాధానం మీద ఆ నలుగురి భవిష్యత్తు ఆధారపడి ఉంది అని మహా ఎంత మోటివేట్ చేసినా ఎస్ఐ అడిగినా వాళ్ళ అమ్మకి భయపడి గాయత్రీ మౌనంగా ఉంటుంది. ఇక మహా, పోలీసులు వెళ్తుంటే.. మహా అని పిలుస్తుంది గాయత్రీ. ఇక పరుగెత్తుకుంటూ వచ్చి గాయత్రీ అన్ని నిజాలు చెప్తుంది. మా అమ్మ, నాన్న కావాలనే ఇలా చేశారు. మా బావ అంటే నాకు ఇష్టం.. ఏదో సంబంధం తీసుకొచ్చారు. అది నాకు ఇష్టం లేదు.. వాళ్ళు అమాయకులు వారిని విడిచిపెట్టండి అని ఎస్ఐ కి గాయత్రీ జరిగిందంతా చెప్తుంది. దాంతో కంప్లైంట్ ఇచ్చిన పురుషోత్తంని పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్ కి తీసుకెళ్తారు. ఇక స్టేషన్ కి వెళ్ళాక మహాని ఎస్ఐ మెచ్చుకుంటాడు. మాధవ, చక్రి, కేశవ, కన్నాలని వదిలేస్తాడు ఎస్ఐ. ఇక బయటకి వచ్చాక అందరు మహాకి థాంక్స్ చెప్తారు. ఆ తర్వాత ఇంటికి వెళ్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.